హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కానిస్టేబుల్ అకాల మృతి.. ఎస్పీ సంతాపం

AKP: జిల్లా స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ పైలా మోహన్ అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ఎస్పీ తుహిన్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సానుభూతి తెలిపారు. స్వగ్రామమైన దేవరపల్లి మండలం కొత్తపెంటలో అధికారిక ప్రభుత్వ లాంఛనాలు, పోలీసు గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు పోలీసు అధికారులు పాల్గొని నివాళులర్పించారు.