కృష్ణా: కూటమి ప్రభుత్వంలో పేదల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.17 కోట్ల 56వేలు ఆర్ధిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం ఉదయం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 26మందికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందచేశారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


