హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గువ్వలచెరువు ఘాట్‌లో సొరంగ మార్గం

KDP: కడప-రాయచోటి మధ్య గువ్వల చెరువు ఘాట్‌లో రూ. 940 కోట్ల అంచనా వ్యయంతో 7.5 కిలోమీటర్‌ల నాలుగు వరుసల సొరంగ మార్గం నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. వన్యప్రాణి సంరక్షణ విభాగాల అనుమతుల కోసం జాతీయ రహదారుల అధికారులు దరఖాస్తు చేశారు. అనుమతులు లభిస్తే ప్రయాణం సురక్షితంగా మారడంతో పాటు ఘాట్ కష్టాలు తగ్గనున్నాయి.