హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ, బీటీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

KDP: చింతకొమ్మదిన్నె మండలంలోని 21, 24 డివిజన్‌లలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి బుధవారం పర్యటించారు. రూ. 3.40 కోట్ల విలువైన సీసీ, బీటీ రోడ్‌ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కమలాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.