హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ-పంట ఈ కేవైసీ తప్పనిసరి: రాజేశ్వరి

తూ.గో: రైతులు ఈ-పంట ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని గోకవరం మండల వ్యవసాయ శాఖ అధికారి పి. రాజేశ్వరి సూచించారు. ఈకేవైసీ చేయించుకోకపోతే ధాన్యం కొనుగోళ్లలో రైతుల పేర్లు నమోదు కాకపోవచ్చన్నారు. రైతులు ఆధార్ కార్డు, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబరుతో సచివాలయ సిబ్బంది, వ్యవసాయ అసిస్టెంట్లను సంప్రదించి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు.