AKP: శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు బుధవారం అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో బేడసేవ, శ్రీచక్ర అభిషేకాలు, నక్షత్ర హారతి, గోపూజ నిర్వహించారు. శ్రీహరి భజన మండలి సభ్యులు కోలాట ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు ఉప్పల రవిరామ్ జవహర్, కార్యదర్శి శ్రీధరాల సోమరాజు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు


