హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చండీ దేవిగా రాజరాజేశ్వరీదేవి దర్శనం

VZM: బొండపల్లి మండలం దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరి దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు సింహ వాహనంపై చండీదేవిగా భక్తుల పూజలు అందుకున్నారు. ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని చండీ దేవిగా అలంకరించి చంటి పారాయణతో పాటు విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.