హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

అనంతపురం: గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది. ఆ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.