హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసిన కాంగ్రెస్ నేతలు

TPT: శ్రీకాళహస్తి నూతన డీఎస్పీ పావనిని కాంగ్రెస్ నేతలు తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాలికల జూనియర్ కళాశాల సమీపంలో ఆకతాయిల ఆగడాలు, స్వర్ణముఖి కట్ట వద్ద అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారు.