హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ మహా చండీ దేవిగా రెడ్డెమ్మ తల్లి దర్శనం

అన్నమయ్య: చెర్లోపల్లి రెడ్డెమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రుల ఐదో రోజు అమ్మవారు శ్రీ మహా చండీ దేవిగా దర్శనమిచ్చారు. అర్చకులు అభిషేకం, కుంకుమార్చన నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. రేపు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారని ఆలయ చైర్మన్ లంకిపల్లి రాజన్న నాయుడు, ఈఓ మంజుల తెలిపారు.