హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆళ్లగడ్డలో నూతన విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం

NDL: ఆళ్లగడ్డ ఏపీ టిడ్కో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బుధవారం ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. దీంతో ప్రాంతంలో విద్యుత్ సరఫరా మెరుగుపడి, లోవోల్టేజ్ సమస్యలు తగ్గనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. విద్యుత్ రంగం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.