VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం మధ్యాహ్నం మహిళలు రోడ్డుపై బైఠాయించారు. రెల్లి వీధికి చెందిన భార్యాభర్తల వివాదంలో తమకు న్యాయం చేయాలని విజయనగరం–చీపురుపల్లి ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు జోక్యం చేసుకుని రాకపోకలను పునరుద్ధరించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై మహిళల బైఠాయింపు


