హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

11 ఆలయాల్లో పుష్కర పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: నరసాపురం నియోజకవర్గంలోని 11 ఆలయాల్లో దేవాదాయ శాఖ నిధులతో చేపట్టే పుష్కర పనులను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ బుధవారం ప్రారంభించారు. రూ. 3.12 కోట్లతో భక్తుల కోసం మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయాల రూపురేఖలు మారుస్తామని వెల్లడించారు.