హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తణుకులో శ్రమశక్తి ఉపాధి కేంద్రం ప్రారంభం

W.G: తణుకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన 'శ్రమశక్తి ఉపాధి కేంద్రం'ను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బుధారం ప్రారంభించారు. రోజువారీ కూలీలకు తగిన గౌరవం, రక్షణ, మెరుగైన సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా కార్మికుల శ్రమకు సరైన గుర్తింపు దక్కడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.