హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుంభాభిషేక మహోత్సవంలో ఎమ్మెల్యే

TPT: తొండూరు సొసైటీలో బుధవారం నిర్వహించిన శ్రీ వెంకట పెరుమాళ్ స్వామి కుంభాభిషేక మహోత్సవంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు పొంది, తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.