SKLM: పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణానికి రూ.40 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు బుధవారం నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించి, శంకుస్థాపన చేశారు. పాఠశాల భవన నిర్మాణాన్ని నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల నూతన భవనానికి MLA శంకుస్థాపన


