హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరించాలి'

WG: తణుకు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించాలని సీపీఎం నాయకులు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీవీ ప్రతాప్, కామన మునిస్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రజా సమస్యలను రాబోయే రోజుల్లో దశలవారీగా పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.