MDK: నర్సాపూర్(M) లాలుతండాకు చెందిన రైతు రాములునాయక్ రెండు ఎకరాల వరి పంట చివరి దశకు చేరింది. అయితే సక్రమంగా కరెంటు రాకపోవడంతో పాటు, కోతల వల్ల పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పంటను కాపాడుకునేందుకు ఆయన సొంతంగా జనరేటర్ ఏర్పాటు చేసుకుని నీరు పారిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరంతర విద్యుత్ అందించాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణ
నిరంతర విద్యుత్ అందించాలని రైతుల ఆవేదన!


