హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిరుమలాయపాలెం SIగా సురేష్ బాధ్యతలు

KMM: తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా పోగుల సురేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం పోలీస్‌స్టేషన్ నుంచి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ఆయన విధులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.