SRD: పటాన్చెరువు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఇవాళ పటాన్చెరు పట్టణంలోని శ్రీ మహంకాళి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జీఎంఆర్) పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


