BDK: భద్రాచలం రామాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బుధవారం గజలక్ష్మి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారని స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు విజయరాఘవన్, రామస్వరూప్ తెలిపారు. సకల శుభాలు, ఐశ్వర్యాలను ప్రసాదించే ఈ గజలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.
తెలంగాణ
నేడు గజలక్ష్మి రూపంలో అమ్మవారు


