హైదరాబాద్: 28°C
తెలంగాణ

హ్యాండ్‌బాల్ రిఫరీ శిక్షణ శిబిరం ప్రారంభం

NZB: ఆర్మూర్ మండలం చేపూర్‌లోని క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో తెలంగాణ హ్యాండ్‌బాల్ రిఫరీ శిక్షణ శిబిరం ఈరోజు ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ శిబిరానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 మంది రిఫరీలు హాజరయ్యారు.పదేళ్ల విరామం తర్వాత ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ తెలిపారు.