హైదరాబాద్: 28°C
తెలంగాణ

భర్త ఇంటి ముందు మహిళ పోరాటం..!

SRPT: సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామంలో భర్త ఇంటి ముందు 9నెలల పాపతో బుధవారం ఓ మహిళ మౌన పోరాటానికి దిగింది. ఆడపిల్ల పుట్టిందని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ ఆరోపిస్తు భర్త దండుగల జనార్ధన్ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించింది. ఆరు నెలలుగా తనను భర్త దూరంగా ఉంచుతున్నాడని తనకు న్యాయం చేయాలంటూ బోరున విలపించింది.