KMR: వరి పంటకు దోమపోటు రావడంతో పురుగుల మందులు పిచికారీ చేసినా ఫలితం లేక ఓ రైతు పంటకు నిప్పంటించారు. ఈ ఘటన బుధవారం పల్వంచ మండల కేంద్రంలో జరిగింది. పల్వంచకు చెందిన వెంకట రాములు మూడు ఎకరాల్లో సన్న రకం వరి సాగు చేశారు. పంటకు దోమ పోటు రావడంతో పురుగుల మందులు చల్లినా పంట చేతికి వస్తుందన్న నమ్మకం లేక, తీవ్ర ఆవేదనతో పంటకు నిప్పంటించారు.
తెలంగాణ
దోమ పోటుతో వరి పంటకు నిప్పు..!


