హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా అండర్-19 క్రికెట్ జట్టు ఎంపిక!

VKB: వికారాబాద్ అనంతరెడ్డి గ్రౌండ్‌లో అండర్-19 జిల్లా జట్టు ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 42 మంది యువ క్రీడాకారుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 15 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు త్వరలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో ఆడనున్నారు. ప్రతిభ చూపిన యువ క్రికెటర్లకు అసోసియేషన్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.