హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో ‘ఆపరేషన్ గరుడ’ తనిఖీలు

VSP: విశాఖ నగర పరిధిలో బుధవారం ‘ఆపరేషన్ గరుడ’ పేరిట ఔషధ దుకాణాలపై సంయుక్త తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈగల్ అధికారులు కలిసి నగరంలోని మెడికల్ ఫార్మా దుకాణాలు, ఔషధ పంపిణీ కేంద్రాల్లో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో పలు చోట్ల గడువు ముగిసిన మందులు బయటపడినట్లు అధికారులు గుర్తించారు. పలు శాఖలు ఒకేసారి రంగంలోకి దిగి ఈ దాడులు నిర్వహించాయి.