హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ పనులకు మంత్రి శంకుస్థాపన

ELR: ముసునూరు మండలం బలివేలోని ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ శంకుస్థాపన మహోత్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. రూ.2.50 కోట్లతో చేపడుతున్న ఈ పనులకు మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేశారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.