హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పైపులైన్‌ పగిలి తాగునీరు వృథా

ప్రకాశం: కనిగిరి పట్టణ పరిధిలోని శంకవరం అభయాంజనేయ స్వామి ఆలయం సమీపంలో బుధవారం సాగర్‌ పైపులైన్‌ పగిలిపోవడంతో తాగునీరు వృథాగా పోతోంది. ఉదయం నుంచి నీరు వృథాగా ప్రవహిస్తున్నా మరమ్మత్తులు చేపట్టలేదని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.