WGL: ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ రంగానికి కలిగే నష్టాలను ముందుగానే అంచనా వేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా పంటల పరిస్థితి, నీటి లభ్యతను పరిశీలించి నివేదికలు అందించాలని సూచించారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవలన్నారు.
తెలంగాణ
'ఎల్నినో ప్రభావంపై ముందస్తు అంచనా వేయాలి'


