హైదరాబాద్: 28°C
తెలంగాణ

తృటిలో తప్పిన ప్రమాదం!

BHPL: కాటారం మండల తహసీల్దార్ ఉండే గది పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఘటన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. గత కొద్ది కాలంగా కార్యాలయానికి ఎలాంటి మరమ్మతులు చేయకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సిబ్బంది పేర్కొంది. ఉన్నతాధికారులు అధికారులు భవనాన్ని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.