NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ పాటను ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారి నాలుగో రూపమైన శ్రీ కూష్మాండ దేవిని పూజించే పవిత్ర రోజున దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి అనంతమైన శక్తి ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందం, సిరిసంపదలు, ఆరోగ్యాన్ని నింపాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ పాటను షేర్ చేసిన పీఎం మోదీ!


