హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: అవనిగడ్డలోని తంగిరాల వీరరాఘవయ్య పార్క్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం అవనిగడ్డలోని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తంగిరాల వీరరాఘవయ్య పార్క్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. పంచాయతీకి ప్రత్యేక అధికారుల పాలనలో పార్క్ అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు.