హైదరాబాద్: 28°C
తెలంగాణ

11వ రోజుకు చేరిన దీక్షలు!

RR: కొత్తూరు పరిధిలోని సిద్ధాపూర్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. జీవో నం.641ని వెంటనే రద్దు చేయాలని, తమ పర్యావరణాన్ని, వ్యవసాయ భూములను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా నిరసనలు తీవ్రమవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.