హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుష్కర ఘాట్ నిర్మాణానికి రూ.4.68 కోట్లు

కోనసీమ: రానున్న పుష్కరాల నేపథ్యంలో కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నూతన పుష్కర ఘాట్ నిర్మాణానికి జలవనరుల శాఖ రూ.4.68 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఘాట్లన్నింటినీ కలిపి ఒకే ఘాట్‌గా అభివృద్ధి చేయనున్నారు. పుష్కరాల సమయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు.