హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామాన్యుడికి భారంగా సన్నబియ్యం ధరలు

KMR: జిల్లా సన్నబియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గత 50 రోజుల్లో బియ్యం ధరలు రూ.1,500కు పైగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన తొలినాళ్లలో ధరలు తగ్గినా, ఆ తర్వాత మళ్లీ పెరుగుతున్నాయి. తక్కువ వర్షపాతం, ఎల్‌నినో ప్రభావంపై ప్రచారం, నాణ్యమైన బియ్యానికి పెరిగిన డిమాండ్ ధరల పెరుగుదలకు కారణాలుగా భావిస్తున్నారు.