హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్షతగాత్రుడికి ఎమ్మెల్యే ప్రభాకర్ చేయూత

ELR: ముసునూరు మండలం వేలుపుచర్ల వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని, రోడ్డు పక్కన గాయాలతో పడి ఉన్న వృద్ధుడిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గమనించారు. బలివేలో ఆలయ పునః శంకుస్థాపనకు వెళ్తున్న ఆయన కాన్వాయ్ ఆపి 108కు సమాచారమిచ్చారు. బాధితుడిని ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.