హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేక లడ్డూలు

NTR: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకోనున్న నేపథ్యంలో దేవస్థానం అధికారులు ప్రత్యేక లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. ఒక్కొక్కటి 400 గ్రాముల బరువుతో మొత్తం 20 లడ్డూలు తయారు చేశారు. ఆహార భద్రతాధికారులు ముడి పదార్థాలను పరిశీలించి, నమూనాలను పరీక్షలకు పంపించారు.