TPT: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి సింహ వాహనంపై యోగ నరసింహస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఊరేగింపును తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి ముత్యపుపందిరి వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారి వాహన సేవలతో తిరుమల ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు


