హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోస్టాఫీసుల్లో ఆధార్ శిబిరాలు

ATP: జాతీయ తపాలా వారోత్సవాలను పురస్కరించుకుని అనంతపురం డివిజన్ పరిధిలోని పోస్టాఫీసుల్లో ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నామని డివిజన్ సూపరింటెండెంట్ అమర్‌నాథ్ పేర్కొన్నారు. విద్యార్థుల్లో తపాలా బిళ్లల సేకరణ, చారిత్రక అంశాలపై అవగాహన పెంపొందించేలా క్విజ్ పోటీలు నిర్వహించామని చెప్పారు. తపాలాశాఖ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.