హైదరాబాద్: 28°C
తెలంగాణ

వక్ఫ్ భూములపై విచారణకు డిమాండ్

SRCL: ఇల్లంతకుంట మండలం ముస్కానిపేటలో 49.15 ఎకరాల వక్ఫ్ భూములకు ధరణిలో పట్టాలు మారడం వివాదమైంది. సర్వే నం.246, 258, 265, 330-332 భూములు వక్ఫ్ ఆస్తులుగా రికార్డుల్లో ఉన్నాయని కలెక్టరేట్ ఉత్తర్వులే చెబుతున్నాయి. వీటికి రైతుభరోసా అందుతోందని ఆరోపణ. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా చర్యల్లేవని, విచారణ జరపాలని మత పెద్దలు కోరుతున్నారు.