హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ ఉత్సవ్‌–2026కు చైనా రాయబారి

NTR: విజయవాడ ఉత్సవ్‌–2026కు చైనా రాయబారి జు ఫీహోంగ్‌ హాజరుకానున్నారు. అక్టోబర్‌ 16 నుంచి 18 వరకు ఆయన తన సతీమణి టాన్‌ యుక్సియుతో కలిసి విజయవాడలో పర్యటించనున్నారు. ఉత్సవానికి ఆహ్వానించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. భారత్‌, చైనాలకు గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉందన్నారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు పెరగాలన్నారు.