హైదరాబాద్: 28°C
తెలంగాణ

చండీదేవి అవతారంలో.. నవదుర్గ అమ్మవారు

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని నవదుర్గ మాత ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాలుగో రోజు అమ్మవారు శ్రీ చండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.