హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంట్ కోతలతో రైతుల్లో ఆందోళన

KMR: జిల్లాలో 5 లక్షల ఎకరాలకు పైగా సాగు బోరుబావులపై ఆధారపడి ఉంది. ప్రస్తుత వానాకాలంలో 3.14 లక్షల ఎకరాల్లో వరి, 87 వేల ఎకరాల్లో సోయాబీన్, ఇతర పంటలు సాగవుతున్నాయి. విద్యుత్ కోతలతో పంటలకు నీరందక దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు సకాలంలో విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నాయి.