MDCL: బోడుప్పల్ పరిధిలో జలమండలి నీటి పైపులకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుతున్న వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. తనిఖీల్లో 9 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, మరో 40కి పైగా అక్రమ కనెక్షన్లు ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. విజిలెన్స్ తనిఖీలను ఇంతటితో ఆపకుండా ప్రతి ఇంటినీ పరిశీలించి అక్రమ కనెక్షన్లను గుర్తించాలని పలువురు కోరుతున్నారు.
తెలంగాణ
అక్రమ నీటి మోటార్లపై జలమండలి చర్యలు


