ప్రకాశం: గిద్దలూరు మండలం బురుజుపల్లి తండా ప్రాంతంలో బుధవారం నాటుసారా తయారు చేస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడుల్లో పలు నాటుసారా బట్టీలను ధ్వంసం చేసి, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నాటుసారా తయారీ, విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నాటుసారా బట్టీలపై పోలీసుల దాడులు


