హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువులో పడి వ్యక్తి మృతి

NLG: దసరా సెలవుల్లో కుటుంబంతో గడిపేందుకు వచ్చిన నల్గొండకు చెందిన ఎండీ అహ్మద్ అలీఖాన్(38) కనగల్ చెరువులో మునిగి మృతిచెందాడు. సౌదీ అరేబియాలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఆయన మంగళవారం భార్యాపిల్లలతో చెరువు సందర్శనకు వచ్చాడు. ఈత కొట్టేందుకు నీటిలో దిగగా, ఈత రాక మునిగిపోయాడు. సమీప రైతులు బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయాడు.