తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం క్యూలైన్లలో భక్తులు 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే 84,179 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 29,644 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.01 కోట్లుగా నమోదైందని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు.
భక్తి
తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ


