హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు రోజులు నీటి సరఫరా బంద్

SKLM: నేటి నుండి మూడు రోజుల(14,15,16 తేదీలలో )పాటు శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని 50 వార్డుల్లో నీటి సరఫరా బంద్ అవుతుంది. గొంది వీధిలో 600ఎం. ఎం.గ్రావిటీ పైప్ లైన్ మరమ్మత్తులు జరుగుతున్నందున నీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ జి.శ్రవణ్ కుమార్ తెలిపారు. ప్రజలు ఈ అసౌకర్యాన్ని గమనించి, నగరపాలక సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.