NLR: ఆత్మకూరు పట్టణంలోని బైపాస్ రోడ్డుపై వాకర్స్ భద్రత దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు ఒకవైపు మార్గాన్ని మూసి వేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో వాహనదారులు సూచించిన మార్గంలో నెమ్మదిగా, అప్రమత్తంగా ప్రయాణించాలన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు ఆత్మకూరు పోలీసులు విజ్ఞప్తి!


