హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షన్‌లో రూ.16 చిల్లర మాయం

MHBD: దంతాలపల్లి మండలంలో పోస్టాఫీస్ ద్వారా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులకు రూ.2,016 ఇవ్వాల్సి ఉండగా, రూ.2,000 మాత్రమే చెల్లిస్తూ రూ.16 చిల్లర ఇవ్వడం లేదు. తమకు రావాల్సిన మొత్తం అందడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపి, లబ్ధిదారులకు పూర్తి మొత్తం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.